రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) అనేది కీళ్ల యొక్క దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి ఆర్థరైటిస్‌గా అభివృద్ధి చెందడానికి చాలా సంవత్సరాల పూర్వ కాలాన్ని కలిగి ఉంటుంది. ఈ వ్యాధి వారి ఉత్పాదక వయస్సులో ఉన్న యువతీ మరియు పురుషులలో కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ లింగ భేదాలు ఉండవు, వయసు పెరిగే కొద్ది వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది సాధారణంగా ఉదయాన్నే వివిధ కీళ్ల నొప్పులు మరియు దృఢత్వంతో ఉంటుంది, సాధారణంగా చేతి కీళ్ల మరియు పాదాలు నొప్పులు. ఒకసారి ఇవి మెడ నొప్పి మరియు మోకాలు , భుజాలు నొప్పిగా కూడా కనిపిస్తాయి. రుమటాలజిస్ట్ని కలవడానికి ముందు కీళ్ల వాపు స్పష్టంగా కనిపించినప్పటికీ, రోగులు దానిని వివిధ మార్గాల్లో నొప్పి మందులు వాడి గందరగోళానికి గురిఅవుతారు. వ్యాధి ప్రారంభంలో తొలి దశ వైద్యం దీర్ఘకాలంలో చికిత్సకు మంచి తొలి ప్రయత్నం చేయరు. అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నపటికీ తాత్కాలిక విపరీతమైన నొప్పి మందులతో కాలం గడుపుతారు ఈ లోగా వ్యాధి బలపడి మోకాలి మార్పిడి చికిత్స చేయవలసిని అవసరం ఏర్పడుతుంది , క్రమంగా భుజం దృఢత్వం మరియు కదలికలు తగ్గుతాయి; చేతులు మరియు పాదాల వైకల్యాలు కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటాయి, అవి పూర్తిగా మంచం పట్టేందుకు తీసుకొని వెళ్తాయి.
వ్యాధిని అర్థం చేసుకోవడం మరియు తొలి దశ వైద్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ చేతుల్లో ఉందని తొందరగా రుమాటోలోజిస్ట్ను సంప్రదించమని WHO సూచిస్తుంది. ఇప్పుడే చర్య తీసుకోండి. ఆలస్యం చేయవద్దు-ఈరోజే కనెక్ట్ అవ్వండి అనే నినాదం తీసుకువచ్చింది. ఈ రోగులు వివిధ ఊపిరితిత్తుల సమస్యలు ప్రమాదకరమైన వేగంగా పరివత్తన చెందే ఆయె ఎయె ఎల్ డి ఊపిరితిత్తుల వ్యాధి దోహదపడుతాయి, ఇవి బాగా ముదిరినప్పుడు కీలు ఎలగైత్యే అరిగిపోతాయో అలాగే ఉపిరితిత్తులు మార్పిడి చికిత్స చేసుకొనే అవసరం కూడా ఉత్పన్నమవుతాయి, రుమటాయిడ్ ఆర్తరైటిస్ వ్యాధి గ్రస్తులు స్ట్రోక్స్ మరియు గుండెపోటుకు ఎక్కువ అవకాశం ఉంది.